Home  »  News  »  'ఇది నా సినిమా' అని నేను గర్వంగా చెప్పుకునే సినిమా!

Updated : Feb 2, 2022

శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం 'మాతృదేవోభవ'. 'ఓ అమ్మ కథ' అన్నది ఉప శీర్షిక. సీనియర్ నటీమణి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రముఖ రచయిత మరుధూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 

సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'మాతృదేవోభవ' ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సుధ, నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్ ఎస్.రెడ్డి, దర్శకుడు హరనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సుధ మాట్లాడుతూ... "ఇది నా సినిమా అని నేను గర్వంగా చెప్పుకునే సినిమా 'మాతృదేవోభవ'. దర్శక నిర్మాతలకు ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. ఇందులో నటించిన, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన 'మాతృదేవోభవ' మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ.. "మాతృదేవోభవ వంటి మంచి సినిమాతో నిర్మాతలుగా పరిచయమవుతుండడం అదృష్టంగా భావిస్తున్నామని, సుధ గారి కెరీర్ లో ఈ చిత్రం ఓ కలికితురాయిగా నిలుస్తుందని, ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా "మాతృదేవోభవ" చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

చిత్ర దర్శకుడు హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 'మాతృదేవోభవ' వంటి సందేశాత్మక చిత్రంతో దర్శకుడిగా మారుతుండడం గర్వంగా ఉందన్నారు. నిర్మాతలకు, సీనియర్ నటీమణి సుధ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.