![]() |
![]() |

ఐశ్వర్యా రజనీకాంత్ కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి, ట్రీట్‌మెంట్ నిమిత్తం ఓ హాస్పిటల్‌లో చేరింది. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె చేతికి కన్నులా ఉండటం గమనించవచ్చు. Also read: పుష్ప సాంగ్‌తో రెచ్చిపోయిన ఎయిర్ హోస్టెస్
"అన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. అడ్మిట్ అయ్యాను. మాస్క్ ధరించండి, వాక్సిన్ వేయించుకొని సురక్షితంగా ఉండండి. 2022లో నాకోసం మీరు ఏం ఉంచారో దాన్ని చూస్తాను" అని రాసుకొచ్చింది ఐశ్వర్య. Also read: హృతిక్ కొత్త గాళ్‌ఫ్రెండ్ ఇదివరకు మరొకరితో సహజీవనంలో ఉంది!
గత నెల తన భర్త ధనుష్‌తో విడిపోతున్నట్లు ఆమె ప్రకటించింది. 2004లో పెళ్లి చేసుకున్న వారికి ఇద్దరు కొడుకులు.. యాత్ర, లింగా ఉన్నారు. ఐశ్వర్య '3' అనే రొమాంటిక్ థ్రిల్లర్ 'వయ్ రాజా వయ్' అనే బ్లాక్ కామెడీలను డైరెక్ట్ చేసింది.
![]() |
![]() |