![]() |
![]() |

ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'భామా కలాపం'. ఆహా ఓటీటీలో ఫిబ్రవరి 11న నేరుగా విడుదలవుతోంది. 'డియర్ కామ్రేడ్' డైరెక్టర్ భరత్ కమ్మా ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ మూవీకి ఆయన శిష్యుడు అభిమన్యు దర్శకత్వం వహించాడు. ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్క్ హ్యాత్‌లో జరిగిన ఈవెంట్‌లో లైగర్ విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు.
విజయ్ దేవరకొండ వేదిక వద్దకు రాగానే అతనిపై ఒక ఆడియో విజువల్‌ను ప్రదర్శించారు. ఆ తర్వాత అతను 'భామాకలాపం' ట్రైలర్‌ను లాంచ్ చేశాడు. భరత్ కమ్మ, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడాక యాంకర్ శ్యామల యూనిట్ మొత్తాన్ని స్టేజ్‌పైకి ఆహ్వానించింది. ఆ వెంటనే విజయ్ మైక్ అందుకున్నాడు. "భరత్ కమ్మ 'బైసైకిల్' అనే ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. అది చూసినప్పట్నుంచీ అతని డైరెక్షన్‌లో సినిమా చెయ్యాలని వెంటపడ్డాను. అలా 'డియర్ కామ్రేడ్' చేశాం. ఆ సినిమా నాకు చాలా స్పెషల్. ఆ సినిమా రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన అభిమన్యు ఇప్పుడు 'భామా కలాపం'ను డైరెక్ట్ చేశాడు. ప్రియమణిగారు ఏ లాంగ్వేజ్‌లో చేస్తే ఆ లాంగ్వేజ్ యాక్టర్‌లా అనిపిస్తారు. 'ద ఫ్యామిలీ మ్యాన్'లో ఆమె నటన నాకు చాలా నచ్చింది. 'భామా కలాపం' ద్వారా ఆహాలోకి వస్తున్నందుకు హ్యాపీ. ఫిబ్రవరి 11న నేనూ ఆ మూవీని చూస్తాను" అని చెప్పాడు విజయ్.
4 నిమిషాల తన స్పీచ్‌లో చివరగా ఫ్యాన్స్‌కు కిస్సులు ఇచ్చి, అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. మొత్తం మీద 20 నిమిషాల కంటే ఎక్కువసేపు అతను ఉండకపోవడంతో అతని కోసం వచ్చిన ఫ్యాన్స్ నిరాశచెందారు.
![]() |
![]() |