![]() |
![]() |

అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్న విషయం తెలిసిందే. అబ్రాడ్‌లో పదహారు రోజులు గడిపాక ఈరోజు బన్నీ హైదరాబాద్‌లోని ఇంటికి వచ్చాడు. వచ్చాక అయాన్, అర్హ చేసిన పనికి అతను ఆశ్చర్యపోయాడు. గులాబీ రేకులతో ఫ్లోర్‌పైన "వెల్‌కమ్ నానా" అని ఇంగ్లీషులో అలంకరించి స్వాగతం పలికారు. దానికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన బన్నీ, "16 రోజులు విదేశాల్లో గడిపి తిరిగొచ్చాక మధురమైన స్వాగతం" అనే క్యాప్షన్‌ను దానికి జోడించాడు. ఆ ఫొటోలో స్వాగతాలంకరణ ఎదురుగా నిల్చొని అర్హ కనిపిస్తుండగా, కొంచెం అవతల అయాన్ నిల్చొని ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు గంటల్లో ఆ పోస్ట్‌కు 1.38 మిలియన్ లైక్స్ రావడం విశేషం.

కొద్ది రోజుల క్రితం దుబాయ్ నుంచి ఓ ఫొటోను షేర్ చేశాడు అల్లు అర్జున్. అందులో అతను తను బస చేసిన 'ఆరా స్కైపూల్' నుంచి నుంచి గ్లాస్ ద్వారా దుబాయ్ అందాలను వీక్షిస్తూ కనిపించాడు. అతను కెమెరాకు అభిముఖంగా నిల్చొని వున్నాడు. ఒక యాడ్ షూట్ నిమిత్తం అతను దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం.

సినిమాల విషయానికి వస్తే, ఇటీవల అతను నటించగా విడుదలైన 'పుష్ప: ది రైజ్' బ్లాక్‌బస్టర్ హిట్టయి, హిందీ వెర్షన్ రూ. 100 కోట్ల క్లబ్బులో చేరేందుకు పరుగులు పెడుతోంది. త్వరలోనే అతను 'పుష్ప: ది రూల్' షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేసే ఈ మూవీలో రష్మికా మందన్న హీరోయిన్‌గా, ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.
![]() |
![]() |