Home

»

Latest News

మ‌హేష్ - బాల‌య్య హంగామాకు డేట్ ఫిక్స్‌

Jan 21, 2022 9:52AM

వెండితెర‌పై త‌న‌దైన పంధాలో ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ లు చెబుతూ విల‌న్ ల‌ని మ‌ట్టి క‌రిపించే నందమూరి బాల‌య్య త‌న పంథాకు భిన్నంగా `ఆహా` ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం తొలి సారి హోస్ట్ గా మారిన విషయం తెలిసిందే. బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బి కె`. సెల‌బ్రిటీల‌ని త‌న‌దైన స్టైల్లో పంచ్ ల‌తో ఆడుకుంటున్న బాల‌య్య ఈ షోని టాప్ లో నిల‌బెట్టారు. ఐఎమ్‌డీబీ లో ఈ టాక్ షోకు 9.8 రేటింగ్ ల‌భించింది. ఈ స్థాయిలో రేటింగ్ ల‌భించిన తొలి టాక్ షోగా `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బి కె` రికార్డుని సొంతం చేసుకుంది.

గ‌త కొన్ని వారాలుగా సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూల‌తో అల‌రిస్తూ ఎంట‌ర్ టైన్ చేస్తున్న ఈ టాక్ షో సీజ‌న్ త్వ‌ర‌లో ఎండ్ కాబోతోంది. త్వ‌ర‌లోనే ఈ సీజ‌న్ ఫైన‌ల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విష‌యాన్ని గ‌తంలోనే ప్ర‌క‌టించిన `ఆహా` వ‌ర్గాలు ఇంత వ‌ర‌కు ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయ‌లేదు. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి సంబంధించిన డేట్ ని కూడా రివీల్ చేకుండా గ‌త కొన్ని వారాలుగా స‌స్పెన్స్ ని మెయింటైన్ చేస్తోంది.  

అయితే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం గ‌త కొన్ని వారాలుగా వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న మ‌హేష్ అభిమానులు ఇంత‌కీ మ‌హేష్ ఎపిసోడ్ షూట్ చేశారా?  లేదా? .. మ‌హేష్ ఎపిసోడ్ వుంటుందా? అని సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపారు. అయితే వీరి నిరీక్ష‌ణ‌కు `ఆహా` తెర దించింది. ఎట్ట‌కేల‌కు మొత్తానికి మ‌హేష్ ఫైన‌ల్ ఎపిసోడ్ అంటూ ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది. దీంతో ఈ టాక్ షో సీజ‌న్ ముగియ‌బోతోంది.

ఈ సీజ‌న్ ఫైన‌ల్ ఎపిసోడ్ గా మ‌హేష్ గెస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 4న మ‌హేష్ ఫైన‌ల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది. దీంతో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె` సీజ‌న్ ఎండ్ కాబోతోంది. అయితే ఈ వేదిక‌పై మ‌హేష్ - బాల‌య్ మ‌ధ్య ఎలాంటి సంభాష‌ణ జ‌ర‌గ‌బోతోంది? .. బాల‌య్య ప్ర‌శ్న‌ల‌కు మ‌హేష్ ఎలా స్పందిస్తారు? అన్న‌ది ఇప్పుడు హాట్ చ‌ర్చ‌గా మారింది. త్వర‌లోనే దీనికి సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేయ‌బోతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com