![]() |
![]() |

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బాటలోనే తనయుడు మహేశ్ బాబు కూడా టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా నిలిచారు. అంతేకాదు.. కృష్ణ తరహాలోనే మహేశ్ కూడా ఒక దశలో సంక్రాంతి హీరో అనిపించుకున్నారు. `ఒక్కడు`(2003), `బిజినెస్ మేన్`(2012), `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`(2013), `సరిలేరు నీకెవ్వరు`(2020) వంటి విజయవంతమైన చిత్రాలతో వేర్వేరు సంవత్సరాల్లో ముగ్గుల పండక్కి మురిపించారు మహేశ్ బాబు. వీటిలో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `సరిలేరు నీకెవ్వరు` ఇదే జనవరి 11న ఏడేళ్ళ వ్యవధిలో విడుదలై వసూళ్ళ వర్షం కురిపించాయి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 1985లో ఇదే జనవరి 11న కృష్ణ నటించిన ఓ సెన్సేషనల్ హిట్ రిలీజయ్యింది. ఆ చిత్రమే.. `అగ్ని పర్వతం`. కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో పలు రికార్డులను భూస్థాపితం చేసింది కూడా. మొత్తమ్మీద.. సంక్రాంతి సీజన్ లో ఇటు కృష్ణకి, అటు మహేశ్ కి ఘనవిజయాలను అందించి.. ఘట్టమనేని `సూపర్ స్టార్స్`కి మెమరబుల్ పొంగల్ డేట్ గా జనవరి 11 నిలిచిందన్నమాట.
కొసమెరుపు ఏంటంటే.. 1985 జనవరి 11న విడుదలైన `అగ్ని పర్వతం`లో కృష్ణకి జోడీగా నటించిన విజయశాంతి.. సరిగ్గా 35 ఏళ్ళ తరువాత అంటే 2020 జనవరి 11న మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` కోసం ఓ ముఖ్య పాత్రలో అలరించారు.
![]() |
![]() |