![]() |
![]() |

`ది ఎండ్` (2014) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగేసిన రాహుల్ సాంకృత్యాన్.. రెండో సినిమా `టాక్సీవాలా` (2018)తో విజయం అందుకున్నారు. రీసెంట్ గా `శ్యామ్ సింగ రాయ్`(2021)తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలో ఈ టాలెంటెడ్ కెప్టెన్.. యువ సామ్రాట్ నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2022లోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2023లో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చే అవకాశముందంటున్నారు.
ఇదిలా ఉంటే.. చైతూ కాంబినేషన్ మూవీ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రాహుల్ సాంకృత్యాన్ ఓ సినిమా చేయబోతున్నారట. అంతేకాదు.. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాది చివరలో లేదా 2023 ప్రథమార్ధంలో పట్టాలెక్కే అవకాశముందంటున్నారు. ఈ లోపు శంకర్ డైరెక్టోరియల్ తో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాని కూడా పూర్తి చేసే దిశగా చరణ్ సన్నాహాలు చేస్తున్నారని బజ్. మరి.. చరణ్, రాహుల్ జాయింట్ వెంచర్ పై వస్తున్న వార్తల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. చరణ్ నటించిన మల్టిస్టారర్ మూవీస్ `ఆచార్య`, `ఆర్ ఆర్ ఆర్` త్వరలోనే థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయనున్నాయి.
![]() |
![]() |