![]() |
![]() |

కరోనా వైరస్ మరోసారి వేగం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. వరుసబెట్టి ఒక్కొక్కరుగా సినీ సెలబ్రిటీలు కొవిడ్ 19 బారిన పడుతున్న కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇటీవలే తనకు కరోనా సోకిందని హీరో మంచు మనోజ్ ప్రకటించగా, ఈరోజు మరో యంగ్ హీరో విష్వక్‌సేన్ తనకు కొవిడ్ సోకినట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాడు.
Also read: 'శ్యామ్ సింగ రాయ్'కి ఫస్ట్ వీక్ వచ్చిందిదే.. వీక్ డేస్‌లో పడిపోయిన కలెక్షన్లు!
శుక్రవారం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఒక నోట్‌లో అతను, నాకు కొవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నాను. నా డాక్టర్ సూచన మేరకు అన్ని రకాల సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటిస్తున్నాను. వాక్సినేషన్ తర్వాత కూడా దావానలంలా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండటం దురదృష్టకరం. దయచేసి మాస్క్ ధరించి, సురక్షితంగా ఉండండి. మీ ప్రేమ, సపోర్టుకు థాంక్యూ అని రాసుకొచ్చాడు.

తమ హీరో కరోనా బారినపడటంతో అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇటీవలి కాలంలో కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్ కపూర్, నోరా ఫతేహి ఇలా ఎందరో సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
![]() |
![]() |