![]() |
![]() |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సామాన్యులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అలాగే ఆ సాయంలో కొంచెం కొత్తదనం చూపిస్తాడు. క్రిస్మస్ కి శాంటాగా మారి పలువురికి సాయం చేసే విజయ్.. ఈ ఏడాది కూడా శాంటాగా మారి సాయం చేయడానికి ముందుకొచ్చాడు. మీరు శాంటాగా మారి మీ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. నన్ను సంప్రదించండి, నేను హెల్ప్ చేస్తాను అంటున్నాడు విజయ్.
దేవరశాంటాగా మారిన విజయ్ మరో కొత్త కాన్సెప్ట్ తో సాయం చేయడానికి రెడీ అయ్యాడు. తన సంపాదన నుండి 1 మిలియన్(పది లక్షలు) డబ్బును వంద మందిని ఎంపిక చేసి పంచుతానని అన్నాడు. మీరు శాంటాగా మారి మీ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. వారికి ఆ డబ్బు ఎందుకు అవసరమో చెప్పండి. 100 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. సెలెక్ట్ చేసిన 100 మంది పేర్లను జనవరి 1న ప్రకటిస్తామని విజయ్ చెప్పుకొచ్చాడు.
కరోనా సమయంలో కూడా విజయ్ చాలామంది సామాన్యులకు ఇలా నేరుగా సాయం చేశాడు.
![]() |
![]() |