![]() |
![]() |

కరోనా వైరస్ ఇంకా తన ప్రభావం చూపుతూనే ఉంది. కేసులు తగ్గుముఖం పట్టాయని అనుకుంటున్న సమయంలో ఇంకా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ సుదేందర్ రెడ్డికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ కూడా కరోనా బారిన పడ్డారు.
ఇటీవల అమెరికా వెళ్లిన కమల్.. తాజాగా భారత్ కు తిరిగి చేరుకున్నారు. అయితే అమెరికా నుంచి వచ్చిన తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు కమల్. "అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత కాస్త దగ్గు వస్తుండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. కరోనా ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గిపోలేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి" అని కమల్ ట్వీట్ చేశారు.
కాగా కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్-2', లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో 'విక్రమ్' సినిమాలు చేస్తున్నారు.
![]() |
![]() |