![]() |
![]() |

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'క్యాలీఫ్లవర్'. 'శీలో రక్షతి రక్షిత:' అనేది ఉపశీర్షిక. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో టీజర్ ని మించిన అరాచకం చూపించాడు సంపూ.
"ఎనీ టైం శీలాన్ని కాపాడే సింబలేరా ఈ క్యాలీఫ్లవర్" అంటూ ట్రైలర్ తోనే ఇది హృదయకాలేయం, కొబ్బరిమట్ట తరహా సినిమా అని చెప్పేశాడు సంపూ. ట్రైలర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్, తనదైన విభిన్న శైలి యాక్టింగ్ తో సంపూ ఆకట్టుకున్నాడు. శీలాన్ని కాపాడే సింబల్ గా కనిపించిన క్యాలీఫ్లవర్.. చివరికి తనే శీలాన్ని పోగొట్టుకున్నట్టు కనిపించడం నవ్వులు పూయిస్తుంది. "నేను పూజకి పనికి రాని పురుష్ ని అయిపోయా" అంటూ సంపూ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ముగిసింది.

గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ బ్యానర్లపై ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో సంపూ సరసన వాసంతి హీరోయిన్ గా నటించింది. ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించిన ఈ సినిమా నవంబర్ 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |