Home

»

Latest News

'కాపాడేవా రాపాడేవా' సాంగ్ కి సూపర్ రెస్పాన్స్

Nov 19, 2021 6:36PM

విభిన్న చిత్రాలతో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు నటిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'అర్జున ఫల్గుణ'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే బుధవారం నాడు ఈ మూవీ నుంచి విడుదలైన 'కాపాడేవా రాపాడేవా' సాంగ్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్ ని అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేశారు.

'కాపాడేవా రాపాడేవా' సాంగ్ లిరికల్ వీడియోను బుధవారం యూట్యూబ్ లో విడుదల చేశారు. లిరికల్ వీడియోలో అమ్మవారి ఆశీస్సులతో చెడుపై పోరాడే వ్యక్తిగా విష్ణు కనిపించాడు. ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ సంగీతం, చైతన్య ప్రసాద్‌ సాహిత్యం ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల బుల్లెట్ బండి సాంగ్ తో సంచలనం సృష్టించిన మోహన భోగరాజు వాయిస్ ఈ సాంగ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సాంగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక తాజాగా ఈ సాంగ్ ని అమెజాన్ మ్యూజిక్, వింక్, గానా వంటి ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేశారు.

తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్న 'అర్జున ఫల్గుణ'లో శ్రీవిష్ణు సరసన అమృతా అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com