![]() |
![]() |

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన రామ్, భీమ్ ఇంట్రో వీడియోలు, దోస్తీ సాంగ్, గ్లింప్స్ ఆకట్టుకోగా.. తాజాగా 'ఆర్ఆర్ఆర్' నుండి సెకండ్ సాంగ్ విడుదలైంది.
'నాటు నాటు' అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేశారు. 'ఆర్ఆర్ఆర్ మాస్ యాంతం' పేరుతో విడుదలైన ఈ సాంగ్ మాస్ ని ఉర్రూతలూగించేలా ఉంది. కీరవాణి నాటు మ్యూజిక్, చంద్రబోస్ నాటు లిరిక్స్ కలిసి ఈ సాంగ్ ని పక్కా నాటు సాంగ్ గా మార్చాయి. సాంగ్ వింటుంటూనే కాలు కదపాలి అనిపించేంత హుషారైన సంగీతాన్ని కీరవాణి అందించారు. 'పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు.. పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు' వంటి క్యాచీ అండ్ మీనింగ్ ఫుల్ నాటు లిరిక్స్ ను చంద్రబోస్ అందించారు. రాహుల్ సిప్లిగుంజ్, కాల భైరవల వాయిస్ ఈ సాంగ్ ఇంకో మెట్టు ఎక్కించింది. మొత్తానికి ఈ సాంగ్ మాస్ ని అలరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి.

ఇక ఈ సాంగ్ లిరికల్ వీడియోలో తారక్, చరణ్ ల స్టెప్పులు చూస్తుంటే రెండు పోట్లగిత్తలు కలిసి చిందేసినట్టు అనిపిస్తుంది. తారక్, చరణ్ లు ఇద్దరూ మంచి డ్యాన్సర్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక బిగ్ స్క్రీన్ పై వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఫ్యాన్స్ కి కన్నుల పండుగే.
![]() |
![]() |