![]() |
![]() |

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మల్టీ టాలెంటెడ్. అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కిన ఆయన.. నటుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నారు. నటనతో పాటు ఆయనలో ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. వాటిలో డ్రాయింగ్ ఒకటి. లాక్ డౌన్ లో ఆయన డ్రాయింగ్ టాలెంట్ ప్రపంచానికి తెలిసింది. ఎన్నో అద్భుతమైన పెన్సిల్ స్కెచ్ లను వేసిన ఆయన.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వెంకటేశ్వర స్వామి బొమ్మను గీసి గిఫ్ట్ గా కూడా ఇచ్చారు. తాజాగా అలాంటి గిఫ్ట్ నే రెబల్ స్టార్ కృష్ణంరాజుకి ఇచ్చారు బ్రహ్మానందం.
బ్రహ్మానందం తాను స్వయంగా గీసిన సాయిబాబా ఫోటోను కృష్ణంరాజుకి గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసిన కృష్ణంరాజు.. బ్రహ్మానందంపై ప్రశంసలు కురిపించారు. "కామెడీ జీనియస్ ఆర్ట్ లోనూ జీనియస్. గొప్ప ప్రతిభ ఉన్న మంచి మనిషి. స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చినందుకు థాంక్స్. గాడ్ బ్లెస్ యూ" అని ట్వీట్ చేసిన కృష్ణంరాజు ఫోటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్రహ్మానందం ప్రతిభపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, బ్రహ్మానందం ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రంగమార్తాండ' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
![]() |
![]() |