![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యారు. జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
పునీత్ జిమ్ లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని తెలపడంతో.. ఆయనను కుటుంబసభ్యులు బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
పునీత్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పునీత్ కోలుకోవాలని కోరుకుంటున్నారు.
![]() |
![]() |