![]() |
![]() |

తెలుగు చిత్రం `1 నేనొక్కడినే`(2014)తో కథానాయికగా తొలి అడుగేసిన ఉత్తరాది భామ కృతి సనన్.. అదే సంవత్సరం `హీరోపంతి`తో హిందీనాట హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన `పరుగు` (2008) చిత్రానికి బాలీవుడ్ వెర్షన్ గా రూపొందిన ఈ సినిమా.. కృతి కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ గా నిలిచింది. ఆపై `బరేలీ కి బర్ఫీ`, `లూకా చుప్పి`, `హౌస్ ఫుల్ 4`, `మిమి` చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది కృతి.
కట్ చేస్తే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం బన్నీ నటించిన మరో తెలుగు చిత్రం తాలూకు రీమేక్ లో నటిస్తోంది మిస్ సనన్. ఆ సినిమానే.. `షెహ్ జాదా`. 2020 సంక్రాంతి సెన్సేషన్ `అల వైకుంఠపురములో`కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ కి జంటగా నటిస్తోంది కృతి. ఇటీవలే పట్టాలెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, రోనిత్ రాయ్, సచిన్ ఖేద్కర్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. రోహిత్ ధావన్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2022 నవంబర్ 4న రిలీజ్ కానుంది. మరి.. `పరుగు` రీమేక్ `హీరోపంతి`లాగే.. `అల వైకుంఠపురములో` రీమేక్ `షెహ్ జాదా` కూడా కృతికి కలిసొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |