![]() |
![]() |

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరి' మూవీ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన సినిమాల్లో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కుల వివక్ష, లైంగిక వేధింపుల అంశాలకు హృదయాన్ని స్పృశించే 'లవ్ స్టోరి'ని జోడించి ఈ మూవీని శేఖర్ కమ్ముల రూపొందించాడు.
ఈ మూవీ హైదరాబాద్‌లోని ఒక్క ఏఎంబీ సినిమాస్‌లో రూ. కోటి గ్రాస్‌ను వసూలు చేసి, సంచలనం సృష్టించింది. 251 షోలలో 48,233 మంది ఆడియెన్స్ చూడడం ద్వారా ఈ కలెక్షన్ వచ్చింది. ఈ విషయాన్ని తన అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ పిక్చర్‌ను షేర్ చేయడం ద్వారా ఏఎంబీ సినిమాస్ వెల్లడించింది. "#LoveStory, Success Stories! On an average of 251 shows with an audience of 48,233 bringing in a gross collection of Rs. 1 crore has created a huge success story in itself! We congratulate the team for their hardwork and success!" అని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
![]() |
![]() |