![]() |
![]() |
-a.jpg)
లేడీ సూపర్‌స్టార్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ కొంత కాలంగా సహజీవనంలో ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆ ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉన్నా.. ఇంతదాకా వారు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో చెప్పలేదు. తమ ఇద్దరికీ సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు విఘ్నేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌కు ఆనందం కలిగిస్తున్నాడు.
లేటెస్ట్‌గా నయనతార, తను కలిసి మహారాష్ట్రలో షిర్డీ సహా కొన్ని గుళ్లను సందర్శించుకున్నప్పటి ఫొటోలను షేర్ చేశాడు విఘ్నేశ్. ఆ ఫొటోల్లో నయన్ ఆఫ్-వైట్ సల్వార్ కమీజ్ ధరించి వుండగా, విఘ్నేశ్ వైట్ స్వెట్‌షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ వేసుకొని కనిపించాడు. ఆ ఫొటోలను షేర్ చేసి, "Blessings all the way from Shirdi, Mumbadevi, Maha Lakshmi temple, Sidhi vinayak #godbless #dussehra #ayudhapooja #saraswathipooja #blessings (sic)." అని రాసుకొచ్చాడు.
పని విషయానికొస్తే, నయన్ త్వరలో బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ జోడీగా నటించడం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. అట్లీ డైరెక్ట్ చేస్తున్న లయన్ మూవీలో ఆమె షారుక్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నది. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తున్న తమిళ చిత్రం కాదు వాకుల రెండు కాదల్ మూవీలో విజయ్ సేతుపతి, సమంతతో కలిసి నటిస్తోంది లేడీ సూపర్‌స్టార్.
.jpg)
![]() |
![]() |