![]() |
![]() |

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు, యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. సింగర్ సంజనా కలమంజేతో ఈ నెల 24న ఆయన వివాహం జరగనుంది.
సంజనాతో మహతి నిశ్చితార్థం ఆగస్ట్ లోనే జరిగింది. ఈ నెల 24న ఉదయం 10:30 గంటలకు చెన్నై టీ-నగర్ లోని ద అకార్డ్ ఫంక్షన్‌హాల్‌లో వీరి పెళ్లి జరగనుంది. అనంతరం ఈ నెల 29న హైదరాబాద్ గండిపేట్‌లోని గోల్కొండ రిసార్ట్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం మహతి-సంజనా నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మణిశర్మ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మహతి.. ఛలో, భీష్మ వంటి సినిమాలతో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక సంజనా విషయానికొస్తే ఆమె స్వస్థలం కర్ణాటకకు చెందిన ఉడుపి. అయితే వీరి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో పాటలు పాడిన సంజనా.. మహతి సంగీతం అందించిన 'భీష్మ' మూవీలోని 'హే చూశా' అనే సాంగ్ పడటం విశేషం.
![]() |
![]() |