![]() |
![]() |
.jpg)
నాగచైతన్య, సమంత ప్రేమ-పెళ్లి బంధం ముగిసిపోయింది. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ, ఆ ఇద్దరూ తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామనీ, స్నేహితులుగా కొనసాగుతామనీ ప్రకటించారు. ఆ తర్వాత కూడా సమంత ప్రతి కదలికా వార్త అవుతూ వస్తోంది. ఆమె వ్యవహార సరళిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది. వివాహానంతరం ఆమె ప్రవర్తనను చాలామంది తప్పుపడుతూ వచ్చారు. ఆమె ధోరణి వల్లే నాగచైతన్య ఆమె నుంచి విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నాడంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తొలిసారి ఎమోషనల్‌గా రెస్పాండ్ అయ్యింది సమంత. తనపై వస్తున్న రూమర్స్‌ను ప్రస్తావించి ఆవేదన చెందింది. అలాగే ఆ రూమర్స్ వచ్చినప్పుడు తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వారికి థాంక్స్ చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ నోట్‌ను షేర్ చేసింది సమంత. ఆ నోట్‌ను చూస్తే, ఆమె చాలా ఒత్తిడిలో ఉన్నదనే అభిప్రాయం కలగకమానదు.
"నా పర్సనల్ సమస్య మీద మీరు ప్రదర్శించిన ఎమోషన్స్ నన్ను ఆనందింపజేశాయి. నా మీద చూపించిన జాలి, శ్రద్ధకు థాంక్స్. నా మీద వచ్చిన రూమర్స్ నుంచి నన్ను కాపాడ్డానికి ప్రయత్నించిన వారికి థాంక్స్. నాకు ఎఫైర్స్ ఉన్నాయనీ, పిల్లల్ని కనకూడదని నేననుకున్నాననీ, నేను అవకాశవాదిననీ, నేను అబార్షన్లు చేయించుకున్నాననీ చాలా కథనాలు వచ్చాయి." అని అందులో ఆమె రాసింది.
నాగచైతన్యతో విడాకుల వ్యవహారంపైనా ఆమె స్పందించింది. "విడిపోవడమనేదే ఒక తీవ్రమైన బాధతో కూడిన పని. చాలా దారుణంగా, కనికరం లేకుండా నా వ్యక్తిత్వంపై దాడి జరిగింది. కానీ మీరనుకునే విధంగా నేనెప్పుడూ చెయ్యను. ఇది నా ప్రామిస్. ఈ కుంగుబాటు నుంచి కోలుకునేందుకు నాక్కాస్త టైమ్ ఇవ్వండి." అని ఆమె అర్థించింది.

![]() |
![]() |