![]() |
![]() |

రెండు నెలల పైనుంచీ నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారంటూ అన్ని రకాల మీడియా కోడై కూస్తోంది. ఇంతదాకా ఇద్దరిలో ఎవరూ దానిపై స్పందించకపోవడం, ఇటీవల తన సినిమా లవ్ స్టోరి ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పర్సనల్ అంశాలు అడగవద్దంటూ చైతూ నిబంధన పెట్టడం లాంటివి వారు విడిపోవడం కన్ఫామ్ అనే నమ్మకాన్ని కలిగించాయి. సమంత కూడా తన అడ్రస్‌ను హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ చేస్తోందంటూ కూడా ప్రచారంలోకి వచ్చింది.
అయితే లేటెస్ట్‌గా ఆ ప్రచారాన్ని ఖండించింది సమంత. తను హైదరాబాద్ విడిచి ఎక్కడికీ వెళ్లట్లేదనీ, ఎప్పటికీ హైదరాబాదే తన ఇల్లనీ చెప్పింది. ఇన్నాళ్లుగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై సైలెంట్‌గా ఉన్న సమంత, 'మీరు ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా?' అని ఒక అభిమాని వేసిన ప్రశ్నకు రెస్పాండ్ అయ్యింది.
సమంత సొంత ఫ్యాషన్ లేబుల్ 'సాఖి' ప్రారంభమై సెప్టెంబర్ 28కి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యింది సామ్. అందులో ఒక అభిమాని "మీరు నిజంగా ముంబైకి షిఫ్ట్ అవుతున్నారా?" అని అడిగాడు. అందుకు హైదరాబాద్ ఎప్పటికీ తన ఇల్లంటూ స్పష్టం చేసింది సమంత.

"ఈ రూమర్ ఎక్కడ స్టార్టయిందో నాకు తెలీదు. మిగతా వంద రూమర్ల లాగే, ఇది కూడా నిజం కాదు. హైదరాబాద్ నా ఇల్లు, నేను నా ఇంట్లోనే ఎప్పటికీ ఉంటాను. హైదరాబాద్ నాకు అన్నీ ఇచ్చింది, ఇకముందు కూడా నేనిక్కడే ఉంటాను." అని ఆమె చెప్పింది. సమంత ఇచ్చిన ఈ ఆన్సర్‌తో నాగచైతన్య-సమంత విడాకుల ప్రచారమంతా వదంతులే అని కూడా ఆమె చెప్పినట్లయింది. ఆమె నిజమే చెప్పిందా? చైతూ-సామ్ కలిసే ఉండబోతున్నారా?.. అనే విషయంలో ఇప్పుడు ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.
![]() |
![]() |