![]() |
![]() |

సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంత కాలంగా ఇండస్ట్రీలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా, వారి వైవాహిక బంధంలో బీటలు వారాయా, లేదా అనే విషయం బహిరంగంగా తిరస్కరించడానికి కానీ, ధ్రువీకరించడానికి కానీ ఇద్దరిలో ఎవరూ ముందుకు రాలేదు. లేటెస్ట్‌గా ఇంకో విషయం ప్రచారంలోకి వచ్చింది. అదేమంటే.. చైతూ, సమంత గత కొంత కాలంగా కలిసి ఉండటం లేదనీ, విడివిడిగా గడుపుతున్నారనీ. అంతేకాదు, ఇప్పటికే కోర్టులో వాళ్లు తమ విడాకులకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించేశారంట.
స్పెక్యులేషన్స్ వ్యాపింపజేయడంలో తలపండిన ఒక గాసిప్ పోర్టల్ పరస్పర అంగీకారంతో చైతూ, సమంత విడాకుల కోసం కోర్టును సంప్రదించారనే ప్రచారం నడుస్తోందంటూ రాసుకొచ్చింది. పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేయడానికి నిర్దిష్ట సమయం పడుతుంది కాబట్టి, తమ గురించి బయట ఎన్ని రకాల వదంతులు వ్యాప్తిస్తున్నా వారిద్దరూ నోరు మెదపడం లేదని కూడా అది రాసింది. సమంత, చైతూ తమ విడాకుల పిటిషన్‌ను కోర్టు అధికారికంగా అంగీకరించి, వారికి అనుమతి ఇచ్చిన తర్వాత వారు తమ విడాకుల గురించి ప్రకటన చేయవచ్చని ఆ పోర్టల్ తెలిపింది.
ఈ నెల 24న విడుదల కాబోతున్న తన సినిమా 'లవ్ స్టోరీ'కి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం చైతూ తన డేట్స్‌ను కేటాయించాడు. ఆ సందర్భంగా అతను బయటకు రానున్నాడు, మీడియాతో ఇంటరాక్ట్ కానున్నాడు. విశాఖపట్నంలో జరిగే ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొననున్న అతను అక్కడ, సమంతతో విడాకుల వదంతుల గురించి మాట్లాడే అవకాశం ఉంది.
కొద్ది రోజుల క్రితం వరకు గోవాలో గడిపిన సమంత, హైదరాబాద్ రాకుండా అక్కడ్నుంచి నేరుగా చెన్నైకి వెళ్లిందని సదరు పోర్టల్ రాసింది కానీ ఒక రోజు ముందుగానే తన కుటుంబంలోకి సాషా అనే బుజ్జి కుక్కపిల్ల వచ్చిందని సమంత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన విషయం మర్చిపోకూడదు.
అంతే కాదు, ఈ రోజు 'లవ్ స్టోరి' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దానికి సంబంధించి చైతూ షేర్ చేసిన పోస్ట్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సమంత పంచుకోవడం గమనార్హం. "WINNER!! All the very best to the team @Sai_Pallavi92 #LoveStoryTrailer" అంటూ కామెంట్ రాసింది. అయితే అందులో చైతూ పేరును ప్రస్తావించకపోవడంతో ఆ ఇద్దరి అనుబంధం చెడిందని చెప్పడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరికీ చెడిపోతే, అసలు చైతూ పోస్ట్‌ను సమంత ఎందుకు షేర్ చేస్తుందంటూ ఇంకొంతమంది తిప్పికొడుతున్నారు. ఏదేమైనా, దీన్నొక గేమ్‌లాగా ఆ ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్నారేమో అనే సందేమం కూడా కొంతమందికి కలుగుతోంది.
![]() |
![]() |