![]() |
![]() |

ఎందరో సినీ ప్రముఖుల కూతుర్లు సినీ రంగ ప్రవేశం చేసి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు చేరనుంది. శంకర్ చిన్న కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా రివీల్ చేస్తూ.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆమెకు స్వాగతం పలుకుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
హీరో కార్తి ప్రధాన పాత్రలో ముత్తయ్య దర్శకత్వంలో 'విరుమన్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇందులో డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ విషయాన్ని సూర్య ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. "వెల్‌కమ్ అదితి. నువ్వు ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటావు. గాడ్ బ్లెస్" అని సూర్య తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అదితి శంకర్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టర్ ను పంచుకున్నారు సూర్య. సాంప్రదాయ దుస్తుల్లో అదితి లుక్ ఆకట్టుకుంటోంది. మరోవైపు తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తి, జ్యోతికలకు ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్ శంకర్. అదితిని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు.
![]() |
![]() |