![]() |
![]() |
.jpg)
`మున్నా` (2007), `మిస్టర్ పర్ ఫెక్ట్` (2011).. ఇలా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రెండు సినిమాలు నిర్మించారు స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు. వీటిలో `మున్నా` అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వకపోయినా.. `మిస్టర్ పర్ ఫెక్ట్` పర్ ఫెక్ట్ రిజల్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. చాన్నాళ్ళ నుంచి ప్రభాస్ తో హ్యాట్రిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారు రాజు. `బాహుబలి` సిరీస్ తో ప్రభాస్ పాన్ - ఇండియా స్టార్ గా అవతరించాక.. ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమవుతోంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ప్రభాస్ నటించబోయే 25వ చిత్రాన్ని `దిల్` రాజునే నిర్మిస్తారట. అంతేకాదు.. ఓ స్టార్ డైరెక్టర్ ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తారని.. ఇదో పిరియడ్ డ్రామా అని వినికిడి. అంతేకాదు.. 2022 చివరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈల భారీ బడ్జెట్ మూవీకి `వృందావన` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని కూడా లాక్ చేశారని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ప్రభాస్ తాజా చిత్రం `రాధే శ్యామ్` 2022 జనవరి 14న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు `సలార్`, `ఆదిపురుష్`, `ప్రాజెక్ట్ కె` చిత్రాలు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి.
![]() |
![]() |