![]() |
![]() |

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మళ్లీ కలకలం రేపుతోంది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో 12 మంది సినీ ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మరికొందరు సినీ ప్రముఖులు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో డ్రగ్స్ అంశంపై సినీ నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూనమ్ కౌర్ తాజాగా డ్రగ్స్ అంశంపై ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "డ్రగ్స్ అనేది కేవలం సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతీ ఒక్కరి సమస్య. ఇది సరిహద్దు సమస్య. ఇది రాజకీయ అజెండాతో నడుస్తున్న సమస్య. ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్య. డ్రగ్స్ అంశంపై నేను మాట్లాడతాను. త్వరలోనే నా స్వీయ అనుభవాలను మీతో పంచుకుంటాను" అంటూ పూనమ్ ట్వీట్ చేశారు.
'డ్రగ్స్ అంశంపై నా స్వీయ అనుభవాలను త్వరలోనే బయటపెడతాను' అంటూ పూనం ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆమెకు ఎదురైన అనుభవాలు ఏంటి? ఆమె బయటపెట్టే విషయాలతో ఎవరైనా ఇరుకున పడతారా? అనేవి చర్చనీయంశమయ్యాయి. ఆమె ఈ డ్రగ్స్ వ్యవహారంపై ఎలాంటి సంచలనాలకు తెర తీస్తారో చూడాలి.
![]() |
![]() |