![]() |
![]() |

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పొలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ సాంగ్ పై వివాదం నెలకొంది.
భీమ్లా నాయక్ మూవీ సాంగ్ పై తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాంగ్ లోని కొన్ని లైన్స్ తెలంగాణ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. "తెలంగాణ పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్. తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగొట్టం. రామజోగయ్య శాస్త్రికి ఒక పోలీస్ గురించి వివరించేందుకు తెలుగులో ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టున్నాయి" అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ పై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా 2022 జనవరిలో విడుదల కానుంది.
![]() |
![]() |