![]() |
![]() |

సెప్టెంబర్ 2 మెగా ఫ్యామిలీకీ, మెగా ఫ్యాన్స్‌కూ పండగ రోజు. ఈరోజు పవర్‌స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు, హితులు, స్నేహితులు, అభిమానులు ఎందరో శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆశయ సాధనలో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. వారిలో పవర్‌స్టార్ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. గురువారం ఉదయం ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తమ్మునికి బర్త్‌డే విషెస్ చెప్పారు. అందులో పవన్ కల్యాణ్‌ను 'నిప్పుకణం' అనీ, 'తోడబుట్టిన ఆశయం' అనీ అభివర్ణించారు.
కల్యాణ్‌తో కలిసున్న రెండు ఫొటోలను షేర్ చేశారు చిరు. వాటిలో ఒకదానిలో తమ్మునికి ఆయన ఆప్యాయంగా చెంపపై ముద్దుపెడుతున్నారు. "చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన... ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పుకణం... కళ్యాణ్ @PawanKalyan అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు." అని రాసుకొచ్చారు మెగాస్టార్.

ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన ఇంట్లో సంబరంగా జరిగినప్పుడు పవన్ కల్యాణ్ కూడా వాటికి హాజరయ్యారు. అన్నయ్యనూ, వదిన సురేఖనూ ఆత్మీయంగా పలకరించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పవర్‌స్టార్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ హగ్ చేసుకున్న ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన బన్నీ, "Many many happy returns of the day to my @PawanKalyan garu . May this day and the coming year bring you more n more peace and happiness." అని ట్వీట్ చేశాడు.

![]() |
![]() |