![]() |
![]() |

తాజాగా తమిళ చిత్రం `నెట్రిక్కన్`లో అంధురాలిగా కనిపించి అలరించింది లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమ్ అయింది. కట్ చేస్తే.. ఇప్పుడదే ఓటీటీలో యూత్ స్టార్ నితిన్ అంధుడి పాత్రలో నటించిన `మాస్ట్రో` స్ట్రీమ్ కాబోతోంది. సెప్టెంబర్ 17న ఈ సినిమా సదరు ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.
ఇదిలా ఉంటే.. నయన్, నితిన్ తరహాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా చూపు లేని వ్యక్తి పాత్రలో కనిపించబోతోంది. ఆ చిత్రమే.. సింగ పార్వై`. తమిళంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 1న ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది. మరి.. ఈ ఛాలెంజింగ్ రోల్ లో వరలక్ష్మి ఏ స్థాయిలో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.
కాగా, ఈ ఏడాది ఆరంభంలో `క్రాక్`, `నాంది` చిత్రాలతో తెలుగునాట నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి. `క్రాక్`లో జయమ్మగా నెగటివ్ రోల్ లో మెస్మరైజ్ చేసిన వరలక్ష్మి.. `నాంది`లో లాయర్ ఆద్య ముళ్ళపూడిగా పాజిటివ్ రోల్ లో అలరించింది. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. నటసింహ నందమూరి బాలకృష్ణ - టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీలో భాగం కానుంది.
![]() |
![]() |