Home

»

Latest News

రుహానీ ఖాతాలో మ‌రో హిట్ ప‌డుతుందా!

Sep 1, 2021 1:08PM

త‌మిళ చిత్రం `క‌డైశి బెంచ్ కార్తి` (2017)తో నాయిక‌గా తొలి అడుగేసింది రుహానీ శ‌ర్మ‌. ఆ సినిమా నిరాశ‌ప‌రిచినా.. తెలుగులో ఆమె న‌టించిన మొద‌టి చిత్రం `చి ల సౌ` త‌న‌కి ఫ‌స్ట్ స‌క్సెస్ ని అందివ్వ‌డమే కాకుండా.. న‌టిగా మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చింది. ఆపై `హిట్`, `డ‌ర్టీ హ‌రి` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది రుహానీ. వీటిలో `డ‌ర్టీ హరి` ఓటీటీ హిట్ గా నిల‌వ‌గా.. అంత‌కంటే ముందే వ‌చ్చిన `హిట్` థియేట‌ర్స్ లో ఎంట‌ర్టైన్ చేసింది. ఓవ‌రాల్ గా.. `చి ల సౌ`, `హిట్`, `డ‌ర్టీ హ‌రి` వంటి డీసెంట్ హిట్స్ తో హ్యాట్రిక్ హీరోయిన్ గా గుర్తింపు పొందిందీ ఉత్త‌రాది సోయ‌గం.

ఇదిలా ఉంటే.. ఈ నెల 3న రుహానీ శ‌ర్మ న‌టించిన తాజా తెలుగు చిత్రం `నూటొక్క జిల్లాల అంద‌గాడు` రాబోతోంది. బ‌ట్ట‌త‌ల కార‌ణంగా ఆత్మ‌న్యూన‌త‌కు గుర‌య్యే ఓ యువ‌కుడి క‌థ‌తో ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్ తెర‌కెక్కింది. ఇందులో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ టైటిల్ రోల్ లో న‌టించ‌గా.. అత‌నికి జంట‌గా రుహానీ క‌నిపించ‌నుంది. ప్ర‌చార చిత్రాల‌తో బాగానే ఇంప్రెస్ చేసిన ఈ సినిమా.. థియేట‌ర్స్ లోనూ అదే బాట ప‌డితే రుహానీ ఖాతాలో మ‌రో హిట్ ప‌డిన‌ట్టే. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com