Home

»

Latest News

వారం వ్య‌వ‌ధిలో తండ్రీకొడుకుల చిత్రాలు!

Sep 1, 2021 12:58PM

తెలుగునాట తిరుగులేని సంగీత ద‌ర్శ‌కుడిగా రాణించారు మెలోడీబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌. ద‌శాబ్దానికి పైగా నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా కొన‌సాగిన మ‌ణి.. కొన్నాళ్ళు రేసులో వెనుక‌బ‌డ్డప్ప‌టికీ `ఇస్మార్ట్ శంక‌ర్`తో మ‌ళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. మ‌రోవైపు.. ఆయ‌న త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ కూడా `ఛ‌లో`, `భీష్మ‌` చిత్రాల‌తో త‌న‌దైన ముద్ర వేశాడు.

ఇదిలా ఉంటే..  2021 సెప్టెంబ‌ర్ ఈ తండ్రీత‌న‌యుల‌కు ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. వారం వ్య‌వ‌ధిలో వీరిద్ద‌రి సినిమాలు జ‌నం ముందుకు రాబోతున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. మ్యాచో స్టార్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన స్పోర్ట్స్ డ్రామా `సీటీ మార్` వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 10న థియేట‌ర్స్ లోకి రానుంది. సంప‌త్ నంది డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మ‌ణిశ‌ర్మ బాణీలు అందించారు. క‌ట్ చేస్తే.. వారం త‌రువాత అంటే సెప్టెంబ‌ర్ 17న యూత్ స్టార్ నితిన్ న‌టించిన `మాస్ట్రో` థియేట‌ర్స్ లో కాకుండా ఓటీటీ వేదిక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకి మ‌హ‌తి స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

మ‌రి.. వారం వ్య‌వ‌ధిలో ప‌ల‌క‌రించ‌బోతున్న తండ్రీత‌న‌యులు మ‌ణిశ‌ర్మ‌, మ‌హ‌తి.. ఆయా చిత్రాల‌తో ప్ర‌జాద‌ర‌ణ పొందుతారో లేదో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com