![]() |
![]() |

'పేపర్ బాయ్', 'ఏక్ మినీ కథ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ వరుస మూవీ ఆఫర్స్ తో బిజీగా మారిపోయాడు. త్వరలో ఆయన 'ప్రేమ్ కుమార్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదలైంది.
'ప్రేమ్ కుమార్' మూవీ గ్లింప్స్ ను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. "శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.. నోర్ముయ్ అవన్నీ ఎవరికి అర్థమవుతాయి.. మూడు ముక్కల్లో నేను చెప్తాగా" అంటూ వీడియో ప్రారంభమైంది. "సునంద గారికి సింగిల్ సుపుత్రుడు.. సుందర లింగానికి సోలో స్నేహితుడు.. రోషన్ గాడికి రంకుమొగుడు" అంటూ హీరోని ఉద్దేశించి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఇందులో చింతపిక్కెల ప్రేమ్ కుమార్ అనే పాత్రలో సంతోష్ శోభన్ కనిపిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ని పీకే అని పిలిచినట్లుగా.. ఈ సినిమాలో ప్రేమ్ కుమార్ ని పీకే అని పిలుస్తారని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. పెళ్లికి రెడీ అయిన పీకే వధువు కోసం వేట మొదలుపెడతాడు. ఆ వేటలో హీరోయిన్ తారస పడుతుంది. మరి వీరి పెళ్లి పీటలెక్కిందో లేదో తెలియాలంటే మూవీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. మొత్తానికి గ్లింప్స్ చాలా ఫన్నీగా సాగిపోయింది. ఇక వీడియో చివరిలో 'పెళ్లి కూతురు లేచిపోయింది' అంటూ కమెడియన్ సుదర్శన్ డ్యాన్స్ చేస్తూ చెప్పిన విధానం నవ్వులు పూయిస్తుంది.
అభిషేక్ మహర్షి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ కానుంది. కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
![]() |
![]() |