![]() |
![]() |

ఒక దశలో నంబర్ వన్ కమెడీయన్ గా రాణించాడు సునీల్. అనంతరం కథానాయకుడిగా టర్న్ అయి.. క్రమంగా అటు వైపే ఫుల్ ఫోకస్ పెట్టాడీ టాలెంటెడ్ యాక్టర్. ఆరంభంలో మంచి విజయాలే దక్కినా.. ఆపై కథ అడ్డం తిరిగింది. దీంతో.. మళ్ళీ కథానాయకేతర పాత్రలపై దృష్టి సారించాడు. అలా.. తన మిత్రుడు త్రివిక్రమ్ రూపొందించిన `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో అలరించాడు సునీల్. అలాగే గత ఏడాది ఓటీటీలో విడుదలైన `కలర్ ఫొటో`తో పాటు అంతకంటే ముందే థియేటర్స్ లో సందడి చేసిన `డిస్కో రాజా`లోనూ ప్రతినాయకుడిగా మెప్పించాడు. ప్రస్తుతం సునీల్ చేతిలో `పుష్ప`, `ఎఫ్ 3` వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. సునీల్ చెంతకు మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని బజ్. ఆ సినిమా మరేదో కాదు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ - ఇండియా మూవీ. ఇందులో చరణ్ పక్కన పూర్తిస్థాయి హాస్యనటుడిగా కనిపించబోతున్నాడట సునీల్. ఇటీవల ఈ మేరకు చర్చలు కూడా పూర్తయ్యాయని వినికిడి. త్వరలోనే చరణ్ - శంకర్ మూవీలో సునీల్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ తో సునీల్ పూర్వవైభవం పొందుతాడేమో చూడాలి.
![]() |
![]() |