![]() |
![]() |

‘పుష్ప’తో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ మీద గురి పెట్టాడు. డైరెక్టర్ సుకుమార్, ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ సైతం దీంతో నేషనల్ లెవల్‌కు వెళ్తున్నారు. అందుకని, అందరూ ఎంతో కేర్ తీసుకుని మరీ సినిమా చేస్తున్నారు. ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన నష్టం జరుగుతూ ఉంది. సినిమాను లీకుల బెడద వెంటాడుతోంది. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది.
‘దాక్కో దాక్కో మేక... పులొచ్చి కొరుకుద్ది పీక’ సాంగ్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చెయ్యడానికికంటే ముందే దేవి శ్రీప్రసాద్ పాడిన రఫ్ వెర్షన్ లీక్ అయ్యింది. అలాగే, 14 రీల్స్ ప్లస్‌తో పార్ట్‌నర్స్‌గా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘సర్కారు వారి పాట’ టీజర్ లీకైంది. ఈ రెండు ఇష్యూలను సీరియస్‌గా తీసుకుని లీక్స్ చేశారని అనుకున్నారంతా. అయితే, అసలు విషయం అది కాదు.
‘పుష్ప’ పాటతో పాటు ఒక ఫైట్ లీక్ అయ్యింది. ఒక్క ఫైట్ కాదు, మొత్తం 47 నిమిషాలు ఫుటేజ్ లీక్ అయినట్టు గుసగుస. దాంతో మేటర్ చాలా సీరియస్ అయ్యింది. అందుకని, పోలీసుల వరకూ వెళ్లారు. ఎవరు లీక్ చేశారు? ఏమిటి? అనే విషయాలు నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. మరో వైపు, సాంగ్ లీక్ అయ్యిందని చక్కర్లు కొడుతున్న ఒక వీడియోను, ఆ సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’ను కొరియోగ్రఫీ చేసిన బాలీవుడ్ డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
![]() |
![]() |