![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఖాకి చొక్కా వేస్తే... అభిమానులకు వచ్చే కిక్కే వేరు. ‘గబ్బర్ సింగ్’ ఎఫెక్ట్ అటువంటిది. లేటెస్ట్‌గా పవన్ మళ్లీ ఖాకి చొక్కా వేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ హౌస్‌లో విజయవంతమైన మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా రూపొందుతున్న సినిమాలో పోలీసాఫీసర్ భీమ్లా నాయక్ క్యారెక్టర్‌లో పవన్ యాక్ట్ చేస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ తరువాత షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం చెప్పడానికి రిలీజ్ చేసిన వీడియోలో పోలీస్ లుక్ చూపించారు. ఇండిపెండెన్స్ డేకు పవన్ సివిల్ లుక్ రిలీజ్ చెయ్యబోతున్నారు.
పంద్రాగస్టుకు సినిమా టైటిల్‌తో పాటు పవన్ కల్యాణ్ క్యారెక్టర్ భీమ్లా నాయక్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. ‘‘ఈసారి మామూలుగా ఉండదు మరి, పూనకాలే’’ అని ఆయన ట్వీట్ చేశారు. టైటిల్, గ్లింప్స్ రిలీజ్‌కు ఆదివారం ఉదయం 09.45 గంటల ముహూర్తం ఫిక్స్ చేశారు. శుక్రవారం పవన్ ప్రీ–లుక్ విడుదల చేశారు.
‘అయ్యప్పనుయ్ కోషియమ్’కు త్రివిక్రమ్ తనదైన శైలి మార్పులు చేశారని టాక్. సినిమాకు ఆయన స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నారు.
![]() |
![]() |