![]() |
![]() |
.jpg)
తమిళ పాపులర్ యాక్టర్ ఆర్యపై చీటింగ్ కేసు నమోదైంది. తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి, తన వద్ద నుంచి రూ. 70 లక్షలు తీసుకున్నాడని శ్రీలంకకు చెందిన ఒక యువతి ఆయనపై చీటింగ్ కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి చెన్నై సిటీ పోలీస్ ఆయనకు సమన్లు జారీచేసింది. దీంతో మంగళవారం సైబర్‌క్రైమ్ విభాగం పోలీసుల ఎదుట ఆర్య విచారణకు హాజరయ్యాడు. ఈ కేసు కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.
శ్రీలంకకు చెందిన విద్జ అనే యువతి జర్మనీలో నివాసం ఉంటోంది. లాక్‌డౌన్ కారణంగా తను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడంటూ తన నుంచి ఆర్య రూ. 70.40 లక్షలు తీసుకున్నాడని రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలకు రాసిన లేఖలో వెల్లడించింది. ఆయనపై కోర్టులో ఫిర్యాదు చేసింది. మంగళవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో చెన్నై కమిషనర్ ఆఫీసుకు వెళ్లిన ఆర్య, అక్కడి సైబర్‌క్రైమ్ వింగ్ ఇన్‌స్పెక్టర్ గీత ముందు హాజరయ్యాడు. సుమారు 3 గంటల సేపు ఆయనను గీత ఇంటరాగేట్ చేశారు.
తాము ఈ విషయంలో కేసు రిజిస్టర్ చేయలేదని ఒక పోలీస్ ఆఫీసర్ తెలిపారు. "ఆ మహిళ ఫిర్యాదు ఆధారంగా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకోవడానికి పద్ధతి ప్రకారం విచారణ చేశాం." అని అని చెప్పారు.
2019లో సహనటి సాయేషా సైగల్‌ను ఆర్య వివాహం చేసుకున్నాడు. ఈ జూలై 23న సాయేషా పండంటి పాపకు జన్మనిచ్చింది.
![]() |
![]() |