![]() |
![]() |

ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమాదాస్, హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. త్వరలో ఆయన 'పాగల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూత పడిన థియేటర్స్ ఇటీవల రీఓపెన్ అవ్వడంతో ఇప్పుడిప్పుడే సినిమాలు మళ్ళీ థియేటర్స్ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో విశ్వక్ సేన్ కూడా త్వరలో 'పాగల్'తో థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు.
నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు 'పాగల్' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టీజర్ లో విశ్వక్ సేన్ చెప్పిన డైలాగ్స్, చూపిన ఆటిట్యూడ్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై యూత్ లో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. పాగల్ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో విడుదల కానుందని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. మరి 'పాగల్'గా విశ్వక్ సేన్ ఎలా అలరిస్తాడో చూడాలి.

'పాగల్'లో విష్వక్ సేన్ జోడీగా నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి కనువిందు చేయనున్నారు. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. రధన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
![]() |
![]() |