![]() |
![]() |

ఇటీవల పలువురు స్టార్ హీరోయిన్స్ ఓటీటీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా వంటి హీరోయిన్స్ షోస్, వెబ్ సిరీస్‌లతో అలరిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో రకుల్ ప్రీత్ కూడా చేరింది. ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్దమయిందని తెలుస్తోంది.
సమంత, కాజల్, తమన్నాల బాటలో రకుల్ నడుస్తోంది. హిందీలో ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి రకుల్ ఓకే చెప్పిందట. ఇందులో రకుల్ లీడ్ రోల్ లో నటించనుందని తెలుస్తోంది. కామెడీ జోనర్ లో రూపొందే ఈ సీరీస్.. ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. సినిమాలలో గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్.. కామెడి వెబ్ సిరీస్ తో ఎలా మెప్పిస్తుందో చూడాలి.
రకుల్ తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో నటించింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతున్న 'అక్టోబర్ 31 లేడీస్ నైట్' సినిమాలోనూ రాకుల్ నటిస్తోంది. ఇక హిందీలో 'అటాక్', 'మేడే', 'థాంక్ గాడ్', 'డాక్టర్ జీ' సినిమాలతో బిజీగా వుంది.
![]() |
![]() |