Home

»

Latest News

జ‌న‌వ‌రి 13.. అప్పుడు 'బిజినెస్‌మేన్‌'.. ఇప్పుడు 'స‌ర్కారువారి పాట‌'!

Aug 1, 2021 6:12PM

 

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకి సంక్రాంతి సీజ‌న్ తో ఉన్న అనుబంధ‌మే వేరు. `ట‌క్క‌రి దొంగ‌`(2012)తో మొద‌లుకుని `స‌రిలేరు నీకెవ్వ‌రు` (2020) వ‌ర‌కు ఇప్ప‌టిదాకా ఆరు సార్లు ముగ్గుల పండ‌క్కి మురిపించాడు మ‌హేశ్. `ఒక్క‌డు` (2003), `బిజినెస్ మేన్` (2012), `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` (2013), `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. ఇలా నాలుగు సార్లు పొంగ‌ల్ బ‌రిలో విజ‌యాలు చూశాడు. అయితే `ట‌క్క‌రి దొంగ‌`, `1 నేనొక్క‌డినే` (2014) మాత్రం ఆశించిన ఫ‌లితాలు అందుకోలేక‌పోయాయి.

ఇదిలా ఉంటే.. మ‌హేశ్ తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌` కూడా సంక్రాంతి సీజ‌న్ నే టార్గెట్ చేసుకుంది. తాజాగా విడుద‌ల చేసిన మ‌హేశ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో జ‌న‌వ‌రి 13ని విడుద‌ల తేదిగా ప్ర‌క‌టించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఇప్ప‌టివ‌ర‌కు సంక్రాంతి సీజ‌న్ లో జ‌న‌వ‌రి 13ని టార్గెట్ చేసుకుని జ‌నం ముందుకొచ్చిన మ‌హేశ్ చిత్రం `బిజినెస్ మేన్` మాత్ర‌మే. పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాన్ని అందుకుంది. క‌ట్ చేస్తే.. అదే జ‌న‌వ‌రి 13న పూరి శిష్యుడు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ న‌టిస్తున్న `స‌ర్కారు వారి పాట‌` రాబోతోంది. మ‌రి.. గురువు పూరికి క‌లిసొచ్చిన జ‌న‌వ‌రి 13 శిష్యుడు ప‌రశురామ్ కి కూడా అచ్చొస్తుందేమో చూడాలి.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. `బిజినెస్ మేన్`కి బాణీలు అందించిన త‌మ‌న్ నే `స‌ర్కారు వారి పాట‌`కి కూడా స్వ‌ర‌క‌ర్త‌. అంతేకాదు.. మ‌హేశ్ కాంబినేష‌న్ లో త‌మ‌న్ రెండోసారి సంక్రాంతి సీజ‌న్ లో సంద‌డి చేస్తున్న చిత్రం కూడా `స‌ర్కారు వారి పాట‌`నే కావ‌డం విశేషం. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com