Home

»

Latest News

ఆచార్య సర్ ప్రైజ్.. సోనూసూద్‌ నెవర్ బిఫోర్ లుక్

Jul 30, 2021 9:11PM

కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న ఎందరికో అండగా నిలిచి రియల్‌ హీరో అనిపించుకున్నారు సోనూసూద్‌. నేడు(జూలై 30) సోనూసూద్ పుట్టినరోజు. దీంతో సోషల్‌ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఆయనకు బర్త్‌ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. ఇక ఆచార్య మూవీ టీమ్ సోనూసూద్‌ బర్త్‌ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీలో ఆయన లుక్‌ ని రిలీజ్‌ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. ఇందులో సోనూసూద్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. నేడు సోనూసూద్‌ బర్త్‌ డే సందర్భంగా ఆచార్య టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. "బంగారం వంటి మనస్సు ఉన్న.. విలక్షణ నటుడు సోనూసూద్‌ కు ఆచార్య మూవీ టీమ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ పేర్కొంది. అలాగే మూవీలో ఆయన లుక్‌ ని రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. నుదుట బొట్టు పెట్టుకుని పిల‌క‌తో సోనూసూద్ డిఫరెంట్‌ లుక్‌ లో కనిపించారు. సోనూసూద్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. 

'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com