Home

»

Latest News

ద‌ర్శ‌కుడు నీల‌కంఠ‌.. నిర్మాత అల్లు అర్జున్ మామ‌!

Jul 30, 2021 6:07PM

 

భూదాత వెదిరె రామ‌చంద్రారెడ్డి బ‌యోపిక్‌కు రంగం సిద్ధ‌మైంది. నీల‌కంఠ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి స‌న్నాహాలు చేస్తున్నారు. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి స్వ‌యానా అల్లు అర్జున్‌కు మామ‌. అంటే స్నేహారెడ్డి తండ్రి. గాంధీ ప్రియ‌శిష్యుడైన ఆచార్య వినోబా భావే అడ‌గ‌గానే మొట్ట‌మొద‌ట‌గా పోచంప‌ల్లికి చెందిన రామ‌చంద్రారెడ్డి 100 ఎక‌రాల భూమిని దానం చేసి, ప్ర‌థ‌మ భూదాత‌గా పేరు పొందారు. 

ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞంగా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈసినిమా రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామ‌చంద్రారెడ్డి మ‌న‌వ‌డు అర‌వింద్ రెడ్డి ఈ సినిమాకు సమ‌ర్ప‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com