![]() |
![]() |

సత్యదేవ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'తిమ్మరుసు'. మహేష్ కోనేరు నిర్మించిన ఈ సినిమా రేపు(జూలై 30) థియేటర్లలో విడుదల కానుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.
శుక్రవారం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సత్యదేవ్ మాట్లాడుతూ.. అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ తాను సినిమాలకు భిన్నంగా 'తిమ్మరుసు' ఉంటుందని తెలిపాడు. ఇక తారక్ అన్న చేతుల మీదుగా ట్రైలర్ విడుదల అవ్వడం వల్ల తమ సినిమా స్థాయి పెరిగిందని అన్నాడు. ఈ సినిమా ఇంతగా జనంలోకి వెళ్లడానికి ఆయనే కారణమని చెప్పాడు. నాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.
కాగా సత్యదేవ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 'గుర్తుందా శీతాకాలం', 'గాడ్సే', 'స్కైలాబ్' వంటి చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి.
![]() |
![]() |