![]() |
![]() |

దర్శకుడిగా శంకర్ ది 28 ఏళ్ళ సినీ ప్రస్థానం. ఈ ప్రయాణంలో తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేశారు శంకర్. ఆయన రూపొందించిన తమిళ చిత్రాలు తెలుగులో అనువాద రూపంలో అఖండ విజయం సాధించినప్పటికీ.. ఇక్కడ ఒక్క స్ట్రయిట్ ఫిల్మ్ కూడా చేయలేదు. ఎట్టకేలకు ఆ ముచ్చట తీరనుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ మూవీతో టాలీవుడ్ లో నేరుగా ఓ సినిమా తీయబోతున్నారు శంకర్. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కనుంది.
ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కథానాయకుడి పరిచయ గీతంతో చిత్రీకరణకి శ్రీకారం చుట్టనున్నారట. యువ సంగీత సంచలనం తమన్ స్వరసారథ్యంలో ఇటీవల రికార్డ్ అయిన సదరు పాటని.. శంకర్ శైలిలోనే భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారని సమాచారం. అంతేకాదు.. ఈ ఇంట్రో సాంగ్ సినిమాకి ఓ హైలైట్ గా నిలుస్తుందని వినికిడి. త్వరలోనే చరణ్ - శంకర్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మరి.. `రోబో` తరువాత సాలిడ్ హిట్ లేని శంకర్.. ఈ సినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
![]() |
![]() |