Home

»

Latest News

తారక్ చేతుల మీదుగా 'తిమ్మరుసు' ట్రైలర్ విడుదల

Jul 26, 2021 6:36PM

విభిన్న పాత్రలు, చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'తిమ్మరుసు'. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. ఈ మూవీ జులై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ ను సోమవారం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేసి, చిత్రయూనిట్‌ కు అభినందనలు తెలిపారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కోర్టు నేపథ్యంలో సాగే సన్నివేశాలతో అలరిస్తుంది ట్రైలర్‌. ఇందులో సత్యదేవ్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నాడు. "ఎవరైనా కేసు గెలిస్తే బైక్ నుండి కారుకి వెళతారు.. రామ్ కారు నుండి బైక్‌కి వచ్చాడు" అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ట్రైలర్ ని బట్టి చూస్తుంటే.. ఈ మూవీ స్టొరీ ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది. "నువ్వు సగం బలం లాక్కునే వాలివయితే.. నేను దండ వేసి దండించే రాముడిలాంటివాడిని" వంటి డైలాగ్స్ ట్రైలర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

ఈ మూవీలో ప్రియాంక జ‌వాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్రహ్మాజీ, రవిబాబు, అజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com