Home

»

Latest News

ప్రియమణి పెళ్లి వివాదం.. ముస్తఫా మొదటి భార్య సంచలన వ్యాఖ్యలు

Jul 22, 2021 6:13PM

హీరోయిన్ ప్రియమణి పెళ్లి విషయం వివాదంగా మారింది. 2017లో ప్రియమణి, ముస్తఫాల వివాహం జరిగింది. కానీ ప్రియమణితో తన భర్త ముస్తఫా రాజ్ వివాహం చెల్లదని అతని మొదటి భార్య ఆయేషా వాదిస్తోంది. అతను అధికారికంగా విడాకులు తీసుకోలేదని తెలిపింది. చట్టప్రకారం ముస్తఫా ఇప్పటికీ తన భర్తేనని, ప్రియమణితో అతని వివాహం చెల్లదు అని ఆయేషా పేర్కొంది.

అయేషా వ్యాఖ్యలపై ప్రియమణి పరోక్షంగా స్పందించింది. తమది చట్టవిరుద్ధ సంబంధం కాదని, సెక్యూర్‌ రిలేషన్‌షిప్‌ అని స్పష్టం చేసింది. ముస్తఫా భర్తగా దొరకడం తన అదృష్టమని చెప్పింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారని, అయినప్పటికీ మేము చాలా అన్యోన్యంగా ఉంటున్నామని తెలిపింది. ఎంత బిజీగా ఉన్నప్పటీకి ఇద్దరం ప్రతి రోజు ఫోన్‌లో మాట్లాడుకుంటామని తెలిపింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ప్రియమణి చెప్పుకొచ్చింది.

కాగా.. ముస్తఫా రాజ్ 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత భేదాభిప్రాయాలతో విడివిడిగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే 2017లో ప్రియమణిని వివాహం చేసుకున్నాడు ముస్తాఫా రాజ్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com