![]() |
![]() |

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఈ యువ సంగీత సంచలనం చేతిలో ఇప్పుడు దాదాపు డజను చిత్రాలున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వాటిలో నాలుగు కొణిదెల వారి కాంపౌండ్ సినిమాలే కావడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయని తమన్.. త్వరలో `లూసిఫర్` రీమేక్ కి బాణీలు అందించనున్నాడు. ఇక `వకీల్ సాబ్` తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ కి కూడా ఈ యువ సంగీత సంచలనమే స్వరకర్త. అలాగే, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందించనున్న పాన్ - ఇండియా మూవీకి కూడా తమన్ నే సంగీతమందిస్తున్నాడు. అంతేకాదు.. చిత్రీకరణ తుది దశలో ఉన్న మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా `గని`కి కూడా తమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
మొత్తమ్మీద.. కొణిదెల కాంపౌండ్ లో హీరోలందరికీ ఏకకాలంలో సరిగమలు అందిస్తూ.. వార్తల్లో నిలుస్తాడు తమన్. మరి.. కొణిదెల కాంపౌండ్ లో తమన్ చేస్తున్న ఈ పదనిసల ప్రయోగాలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.
![]() |
![]() |