![]() |
![]() |

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన 'నారప్ప' మూవీ నేరుగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. అయితే దగ్గుబాటి కుటుంబం నుంచి వస్తున్న మరో సినిమా 'విరాటపర్వం' కూడా నేరుగా ఓటీటీలో విడుదల కానుందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మూవీ డైరెక్టర్ తాజాగా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.
రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'విరాటపర్వం'. 'నీది నాది ఒకే కథ' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. మొదటి సినిమాతోనే మెప్పించిన వేణు ఊడుగుల.. 'విరాటపర్వం'కి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ రిలీజ్ పై స్పందించిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లో సినిమాని థియేటర్లోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. సినిమాకి మంచి రేటు వచ్చిందని.. దీంతో ఓటీటీకి అమ్మేశారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీని బట్టి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని అన్నారు.
సినిమాలో రానా, సాయి పల్లవికి సంబంధించిన సన్నివేశాలు మరో నాలుగు రోజుల చిత్రీకరణ చేయాల్సి ఉందని.. ప్రస్తుతం ఆ సన్నాహాల్లో ఉన్నట్లు వేణు తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 1990లలో మావోయిస్టు ఉద్యమం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
![]() |
![]() |