![]() |
![]() |

తమిళ్ స్టార్ హీరో విజయ్ పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రీల్ హీరోలకు పన్నులు కట్టాలంటే మనసొప్పడంలేదని మండిపడింది. ఇంగ్లండ్ నుంచి తాను దిగుమతి చేసుకున్న లగ్జరీ కారుకు పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
విజయ్ 2012లో ఇంగ్లండ్ నుంచి లగ్జరీ కారు(రోల్స్ రాయిస్)ను భారత్ కు దిగుమతి చేసుకున్నాడు. అయితే ఆ కారు దిగుమతికి సంబంధించి భారత ప్రభుత్వానికి విజయ్ పన్ను చెల్లించలేదు. తన కారుపై దిగుమతి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు.. విజయ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే కారుకు పన్ను కట్టనందుకు రూ.లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కోవిడ్ పై పోరాటం కోసం తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది.
ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
![]() |
![]() |