![]() |
![]() |
.jpg)
తెలుగు అనే కాదు, ఏ భాషా చిత్రసీమ చూసుకున్నా.. పురుషాధిక్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇది కేవలం సినీ రంగానికే పరిమితమైంది కాదు.. దాదాపు అన్ని రంగాల్లోనూ మగాళ్లే రాజ్యం చేస్తుంటారనేది మనకు తెలుసు. సినీ రంగంలో అది మరింత ఎక్కువగా కనిపిస్తుంటుందంతే. హీరోలకు, హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఒక్కటి చూసుకుంటే చాలు.. పురుషాధిక్యం ఏ రేంజ్‌లో ఉందో అర్థమైపోతుంది. అలాంటి చిత్రసీమలో విజయశాంతి లేడీ సూపర్‌స్టార్‌గా రాణించిన తీరు అమోఘం. అభిమానులు 'లేడీ అమితాబ్' అని ఆమెను ముద్దుగా పిలుచుకునేవారు. స్టార్‌డమ్‌కు అమితాబ్ కొలమానం కాబట్టి, అలా ఆమెను ఓ మేల్ యాక్టర్‌తో పోల్చి చెప్పుకున్నారు.
విజయశాంతి సినిమాకు తానే హీరో అవడానికి 'ప్రతిఘటన' సినిమా పునాదిరాయి అనుకోవచ్చు. అప్పట్నుంచే ఆమె ఒక్కో ఇటుక పేర్చుకుంటూ 'కర్తవ్యం' నాటికి సూపర్ హీరోయిన్ రేంజికి ఎదిగారు. కెరీర్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్నారు కాబట్టే ఆ రేంజికి వచ్చారామె. ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి 42 సంవత్సరాలు. 1979లో భారతీరాజా డైరెక్షన్‌లో ఓ తమిళ చిత్రం చేశారు. 1980లో కృష్ణతో చేసిన 'కిలాడీ కృష్ణుడు' ఆమె మొదటి తెలుగు చిత్రం. ఆ తర్వాత కాలం నుంచీ తనకు వచ్చిన పాత్రలతో తనేమిటో ప్రూవ్ చేసుకున్నారు.
"అక్కడితే ఆగకుండా హీరోకూ, మాకూ ఏమిటి తక్కువ.. ఒక్క ఫైట్సే కదా అని.. అది కూడా చేసేశాను, సాధించేశాను. అంటే గట్స్. కొట్లాడే మనస్తత్వం ఉంది. భయపడటం విజయశాతం హిస్టరీలోనే లేదు. కొన్నిసార్లు వేరే నిర్మాతలకు రిస్క్ ఇవ్వడం ఎందుకని మేమే చేసుకునేవాళ్లం. ఉదాహరణకు 'కర్తవ్యం' మా బేనర్ మీద చేశాం. దానికి ఉత్తమనటిగా నేషనల్ అవార్డ్ తీసుకున్నా. ఆరోజు మావారు శ్రీనివాస ప్రసాద్ రిస్క్ చేశారు. హిట్టయితే అవుతుంది, లేకపోతే లేదు.. అనుకున్నాం. ఎదుటి నిర్మాతలు నష్టపోకూడదనే అభిప్రాయంతో ఆయన ప్రొడక్షన్ మొదలుపెట్టారు. అది హిట్టవడంతో మిగతా నిర్మాతలు వచ్చారు. 'పోలీస్ లాకప్' లాంటి సినిమాలు చేశారు. దాసరిగారు 'ఒసేయ్ రాములమ్మా' తీశారు. మొదటి అడుగు రిస్కును మేం తీసుకున్నాం, సక్సెస్ అయ్యాం." అని ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి చెప్పుకొచ్చారు.
![]() |
![]() |