![]() |
![]() |

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'నాంది'. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. తాజాగా నాంది మూవీ హిందీ రీమేక్ పై అధికారిక ప్రకటన వచ్చింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు.
నాంది మూవీ హిందీ రీమేక్ కోసం అజయ్ దేవగన్ తో కలిసి పనిచేయబోతున్నట్లు దిల్ రాజు ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. దిల్ రాజు ప్రొడక్షన్స్, అజయ్ దేవ్‌గణ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నాయి. అజయ్ దేవ్‌గణ్ కూడా ట్విట్టర్ వేదికగా నాంది రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ఇప్పటికే దిల్ రాజు నేచురల్ స్టార్ నాని సూపర్ హిట్ మూవీ 'జెర్సీ'ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. జెర్సీ రీమేక్ లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు దిల్ రాజు మరో క్రేజీ మూవీని హిందీలో రీమేక్ చేస్తుండటం విశేషం.
![]() |
![]() |