![]() |
![]() |

నటి అవికాగోర్ రహస్యంగా ఓ బిడ్డకు జన్మనిచ్చిందని వార్తలొచ్చాయి. ఆమెకి సీరియల్ నటుడు మనీష్ రాయ్ సింఘన్ తో ఎఫైర్ ఉందని.. వీళ్లిద్దరికీ ఓ బిడ్డ కూడా ఉందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించిన అవికా.. ఈ వార్తల్లో నిజం లేదని తెలిపింది.
చైల్డ్ ఆర్టిస్ట్ గా 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా.. తెలుగు మూవీ ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడకి పోతావు చిన్నవాడా'తో పాటు కొన్ని సినిమాలతో అలరించింది. అయితే ఒకానొక సమయంలో బొద్దుగా మారడంతో ఆమె అవకాశాలు కోల్పోయింది. దీంతో తీవ్రమైన మనోవేదనకు గురైన ఆమె.. తిరిగి నాజూగ్గా తయారైంది. మరోవైపు అదే సమయంలో ఆమె రహస్యంగా ఓ బిడ్డకు జన్మనిచ్చిందన్న వార్తలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో అవికా స్పందించింది. నటిగా ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి మనీష్ తో స్నేహం ఏర్పడిందని.. అతడికి తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని.. అతడు తండ్రి లాంటి వాడని చెప్పింది.
అలాగే తన ప్రియుడు గురించి కూడా అవికా చెప్పుకొచ్చింది. హైదరాబాద్ కు చెందిన మిలింద్ చంద్వాణీతో కామన్ ఫ్రెండ్స్ ద్వారా అవికాకు పరిచయం ఏర్పడిందట. అతనితో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నానని తెలిపింది. తనను తాను అర్థం చేసుకోవడానికి మిలింద్ ఎంతో తోడ్పడ్డాడని.. శారీరకంగా, మానసికంగా తనలో మార్పు రావడానికి అతనే కారణమని అవికా పేర్కొంది.
![]() |
![]() |